

తెలంగాణ గ్రూప్-1 ఉద్యోగ నియామకాల విషయంలో భారత అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును నేను స్వాగతిస్తున్నాను. ఈ తీర్పు మా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో పాటిస్తున్న పారదర్శకతకు, చిత్తశుద్ధికి ఒక గుర్తింపుగా భావిస్తున్నాను. ఏళ్ల తరబడి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూ, కుటుంబ ఆర్థిక పరిస్థితులపై ఆధారపడలేక, ఉద్యోగం లభిస్తుందో లేదో అన్న ఆందోళనలో కాలం గడిపిన గ్రూప్-1 అభ్యర్థులకు ఇది ఎంతో ఉపశమనం కలిగించే నిర్ణయం.
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నోటిఫికేషన్ విడుదల చేసి, పరీక్షలు నిర్వహించి, కొద్ది నెలల వ్యవధిలోనే నియామక పత్రాలు అందజేశాం. ఈ నియామకాలను అడ్డుకోవాలనుకున్న కుట్రలను ఎదుర్కొని, రాష్ట్ర పునర్నిర్మాణంలో తొలి గ్రూప్-1 అధికారులుగా యువతను భాగస్వాములను చేశాం. వారికి నా అభినందనలు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా టీజీపీఎస్సీ వ్యవస్థను ప్రక్షాళన చేసి, నిరుద్యోగ యువతలో వ్యవస్థపై నమ్మకాన్ని పునరుద్ధరించి, అత్యంత పారదర్శకంగా ఈ నియామక ప్రక్రియను పూర్తి చేసిన టీజీపీఎస్సీ ఛైర్మన్, ఉద్యోగులు మరియు సిబ్బందికి ప్రత్యేక అభినందనలు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!