

ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న వారణాసి సినిమాపై అంచనాలు మాములుగా లేవు. ఈ సినిమా ఇండియానా జోన్స్ లాంటి యాక్షన్ అడ్వెంచర్ గా రాబోతుంది. అయితే ఈ సినిమాలోని కథ మాత్రం మన రామాయణంతో సంబంధం కలిగి ఉంది. దీంతో ఈ సినిమాపై కొండంత అంచనాలు ఉన్నాయి. అయితే ఇటీవల విడుదలైన రణబీర్ కపూర్ రామాయణ టీజర్ మిక్స్డ్ రెస్పాన్స్ పొందింది. దీన్ని చూసిన తర్వాత, నెటిజన్స్ వారణాసి టీజర్ ని మళ్ళీ వైరల్ చేస్తున్నారు. రాజమౌళి విజన్‌లో మహేష్ బాబు రాముడి లుక్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో అని చర్చించుకుంటున్నారు.
రాజమౌళి ఈ సినిమాలో రామాయణం నుంచి ఒక నిజమైన ఎపిసోడ్‌ను తీసుకొని తన స్టైల్లో చూపించబోతున్నారు. మహేష్ రాముడి పాత్రలో కనిపించనున్న ఈ సీన్ హాలీవుడ్ స్థాయి విజువల్స్‌తో రూపొందుతోంది. రాజమౌళి సినిమాలు ఎప్పుడూ అంచనాలను మించి ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఇక ఈ సినిమా కూడా అదే రీతిలో ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.వారణాసి 1300 కోట్ల భారీ బడ్జెట్‌తో హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కుతోంది. మహేష్ రాముడి లుక్ రివీల్ అయినప్పుడు సోషల్ మీడియా తగలబడిపోతుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!