
రాజకీయాలు

రాజ్యసభలో తమ పార్టీ ఉపనేతగా ఉన్న రాఘవ్ చడ్డాను ఆమ్ ఆద్మీ పార్టీ తొలగించింది. ఆయన స్థానంలో పంజాబ్‌కు చెందిన ఎంపీ అశోక్ మిత్తల్‌ను నియమించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాజ్యసభ సచివాలయానికి పార్టీ లేఖ రాసి, ఇకపై సభలో చడ్డాకు తమ కోటాలో సమయం కేటాయించవద్దని కూడా కోరింది.
పార్టీ కార్యకలాపాలకు చడ్డా దూరంగా ఉండటం, కార్యక్రమాలపై స్పందించకపోవడమే ఈ నిర్ణయానికి కారణమని తెలుస్తోంది. అయితే ఉపనేత మార్పు సాధారణ ప్రక్రియేనని, ప్రత్యేక కారణాలు ఏవీ లేవని అశోక్ మిత్తల్ తెలిపారు. చడ్డా ఇతర పార్టీలో చేరతారన్న వార్తలపై కూడా స్పష్టత లేదని ఆయన పేర్కొన్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!