

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమాపై అభిమానుల్లో కొండంత అంచనాలు ఉన్నాయి. తాజాగా వచ్చిన కొత్త పోస్టర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. హనుమాన్ జయంతి సందర్భంగా విడుదలైన ఈ పోస్టర్లో రామ్ చరణ్ లుక్ ఎంతో పవర్‌ఫుల్‌గా ఉంది. చరణ్ కండలు తిరిగిన శరీరంతో బలంగా కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ హనుమంతుడి రూపాన్ని తలపించేలా ఉంది. ఫ్యాన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అయితే ఇందులో ఒకటి మాత్రం మిస్ అయ్యింది. అది ఫ్యాన్స్ ని కంగారు పెడుతుంది.
ఈ చిత్రం ఈ నెల 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని రామ్ చరణ్ ఇటీవల స్పష్టం చేశారు. అయితే కొత్త పోస్టర్లో రిలీజ్ డేట్ లేకపోవడంతో ఫ్యాన్స్ మధ్య తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమా వాయిదా పడుతుందేమో అని టెన్షన్ పడుతున్నారు. దీనిపై మూవీ టీం నుంచి మరోసారి అధికారిక స్పందన కోరుతున్నారు. ఈ సినిమా స్పోర్ట్స్ నేపథ్యంలో గ్రామీణ వాతావరణంలో సాగనుంది.
ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమా, మెగా ఫ్యాన్స్‌లో భారీ ఉత్సాహం కలిగిస్తోంది. రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్ త్వరలో అధికారిక స్పష్టత ఇవ్వాలని అభిమానులు కోరుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!