

ఈరోజు కేసీఆర్ జన్మదిన సందర్భంగా సీఎం ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి మరోసారి బిజీ షెడ్యూల్తో పర్యటనలు చేపట్టనున్నారు. సచివాలయంలో కీలక సమీక్ష అనంతరం ఆయన ముంబై, ఢిల్లీ నగరాలకు బయలుదేరనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో మున్సిపల్ శాఖపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఇటీవల ముగిసిన మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పట్టణాభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణ, పెండింగ్ ప్రాజెక్టుల పురోగతిపై అధికారులతో చర్చించనున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగర అభివృద్ధికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.
సమీక్ష సమావేశం ముగిసిన తర్వాత రాత్రి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ముంబైకి పయనమవుతారు. ముంబైలో రాత్రి బస చేసి, రేపు అక్కడ జరిగే ప్రతిష్టాత్మక ‘క్లైమేట్ వీక్’ కార్యక్రమంలో పాల్గొననున్నారు. పర్యావరణ పరిరక్షణ, గ్రీన్ ఎనర్జీ, సుస్థిర అభివృద్ధి అంశాలపై ఆయన ప్రసంగించనున్నారు. అనంతరం సాయంత్రం ముంబై నుంచి నేరుగా దేశ రాజధాని ఢిల్లీకి చేరుకుని, ఎల్లుండి కేంద్ర ప్రభుత్వం నిర్వహించే అధికారిక కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ నిధులు, విభజన హామీలు, అభివృద్ధి ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!