
క్రీడలు

ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటివరకు వారు కష్టపడి చేసిన సాధన, పట్టుదల, నిబద్ధత వారిని విజయతీరాలకు చేర్చాలని ఆకాంక్షించారు. ఎలాంటి భయాందోళనలు, ఒత్తిడులకు లోనుకాకుండా ప్రశాంతంగా, సానుకూల దృక్పథంతో పరీక్షలు రాయాలని ఆయన సూచించారు.
పరీక్షా హాల్లో ఆత్మవిశ్వాసంతో అడుగుపెట్టాలని, సమయాన్ని జాగ్రత్తగా వినియోగించుకోవాలని సీఎం సూచించారు. విద్యార్థులంతా ఉత్తమ ఫలితాలు సాధించి తమ కలలను సాకారం చేసుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములయ్యే ప్రతి విద్యార్థికి బంగారు భవిష్యత్తు ఉండాలని ఆయన ఆకాంక్షించారు.







.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!