

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక అరుదైన ఘనత సాధించబోతున్నారు. ప్రస్తుతం పదవిలో ఉన్న భారత ముఖ్యమంత్రులలో, ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి కోర్స్ సర్టిఫికెట్ పొందనున్న తొలి సీఎంగా ఆయన రికార్డు సృష్టించనున్నారు. ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలోని కెన్నెడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్లో “21 వ శతాబ్దం కోసం నాయకత్వం: అస్తవ్యస్తత, సంఘర్షణ, ధైర్యం” అనే లీడర్షిప్ కోర్స్‌కు ఆయన హాజరుకానున్నారు. ఈ నెల 25 నుంచి 30 వరకు అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రంలో తరగతులకు హాజరవుతారు.
ఈ కోర్సులో ఐదు ఖండాల నుంచి 20 దేశాల ప్రతినిధులు పాల్గొననుండగా, సీఎం రేవంత్ రెడ్డి వారితో కలిసి అసైన్మెంట్లు, గ్రూప్ ప్రాజెక్టులు, కేస్ స్టడీలలో పాల్గొంటారు. ప్రొఫెసర్ టిమ్ ఓ’బ్రియాన్ ఛైర్మన్‌గా, ప్రొఫెసర్ కరెన్ మోరిసీ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన అనంతరం హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి అధికారిక సర్టిఫికెట్ అందుకోనున్నారు. ఇది భారత రాజకీయ చరిత్రలో ఒక కీలక ఘట్టంగా నిలవనుంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!