

క్రిస్మస్ వేడుకల ప్రారంభ సూచకంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చి ప్రాంగణాల చుట్టూ శిలువ ఊరేగింపులు చేపట్టగా, క్రైస్తవులు ప్రార్థనా గీతాలు ఆలపిస్తూ భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ‘శాంతి, ప్రేమ, సోదరభావం’ అనే సందేశం ప్రజల్లోకి తీసుకెళ్లేలా ఈ కార్యక్రమాలు సాగాయి.
గురువారం ఉదయం నిర్వహించిన తొలి ఆరాధనకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. చర్చి ప్రాంగణాలు కిక్కిరిసిపోవడంతో బయట ప్రాంతాల్లో కూడా భక్తులు ప్రార్థనల్లో పాల్గొన్నారు. దీనికి అనుగుణంగా చర్చి నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. చర్చిలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించగా, ప్రధాన ద్వారాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
మెదక్‌లోని ప్రసిద్ధ సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు శిలువ ఊరేగింపు, ప్రత్యేక ప్రార్థనలతో ప్రారంభమయ్యాయి. తొలి ఆరాధనకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఇన్చార్జి బిషప్ రెవరెండ్ రూబిన్ మార్క్ దైవ సందేశాన్ని వినిపిస్తూ, ఏసు క్రీస్తు జన్మ వెనుక ఉన్న ప్రేమ, క్షమ, త్యాగం, మానవత్వం వంటి విలువల ప్రాధాన్యతను వివరించారు. సమాజంలో పెరుగుతున్న ద్వేషం మధ్య క్రిస్మస్ శాంతి మార్గాన్ని చూపుతుందని ఆయన పేర్కొన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!