

చైనా అంతరిక్ష ప్రయోగాల్లో దూకుడు ప్రదర్శిస్తోంది. తాజాగా తమ రహస్య అంతరిక్ష విమానం షెన్‌లాంగ్‌ను నాలుగవసారి భూ కక్ష్యలో ప్రవేశపెట్టింది. జియుక్వాన్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుంచి లాంగ్‌మార్చ్-2ఎఫ్ రాకెట్ సాయంతో ఈ నెల 7 న షెన్లాంగ్ అంతరిక్షంలోకి పంపబడినట్లు తెలుస్తోంది. బీజింగ్ ప్రభుత్వం దీనికి సంబంధించిన సమాచారం గుప్తంగా ఉంచడంతో అనేక అనుమానాలు నెలకొన్నాయి.
బీజింగ్ వర్గాల ప్రకారం, ఈ ప్రయోగాలు భవిష్యత్తులో అంతరిక్షాన్ని సమర్థవంతంగా వినియోగించడం, తక్కువ ఖర్చులో ప్రయోగాలు చేయడం వంటి అంశాలపై అధ్యయనం చేయడానికి చేపడుతున్నాయి. అయితే, విమాన డిజైన్, లక్ష్యాలు, కక్ష్యలో గడిచే రోజుల సంఖ్య వంటి వివరాలను చైనా బయటపెట్టడం లేదు. అంతరిక్ష నిపుణులు, ట్రాకర్లు షెన్‌లాంగ్‌ను ట్రాక్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
గత షెన్లాంగ్ మిషన్లలో, విమానం కనీసం రెండు రోజుల నుంచి గరిష్ఠంగా ఎనిమిది నెలల వరకు కక్ష్యలో ఉన్నట్లు గుర్తించారు. కొన్ని చిన్న ఉపగ్రహాలను విడుదల చేసినట్లు కూడా గమనించారు. 2020 నుండి చైనా తరహా ప్రయోగాలు కొనసాగిస్తూ వస్తోంది, కానీ పూర్తి సమాచారం అందుబాటులో లేదు.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!