
న్యూస్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిశారు. ఫిబ్రవరి చివరి వారంలో నిర్వహించనున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు కావాలని ఆయనను ఆహ్వానించారు. ఈ కార్యక్రమాన్ని ఈసా – మూసీ నదుల సంగమ ప్రాంతంలో నిర్వహించనున్నట్లు వివరించారు. 1948 ఫిబ్రవరిలో మహాత్మా గాంధీ చితాభస్మాన్ని ఈసా – మూసీ సంగమంలో నిమజ్జనం చేసిన విషయం కూడా కేంద్ర మంత్రికి తెలిపారు.
మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టును చేపడుతున్నామని సీఎం చెప్పారు. బాపూఘాట్‌ను ప్రపంచ స్థాయి విద్యా, సాంస్కృతిక, ఆధ్యాత్మిక మరియు పర్యావరణ చిహ్నంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు అమలు చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాలని రాజ్‌నాథ్ సింగ్‌ను అధికారికంగా కోరారు.













.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!