
సినిమాలు

ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ బలవన్మరణంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషాద ఘటన పట్ల తన సంతాపాన్ని తెలియజేస్తూ, శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కుటుంబానికి అన్ని విధాలుగా సహాయం అందిస్తామని ఆయన పేర్కొన్నారు.
శంకర్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ధైర్యం కలగాలని ముఖ్యమంత్రి ప్రార్థించారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచిందని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం చర్చలు కొనసాగిస్తున్నదని, వారి సమస్యలను పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో చర్యలు తీసుకుంటుందని తెలిపారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!