

విజయ్ నటిస్తున్న ‘జననాయగన్’ సినిమా విడుదలకు ముందే అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. దర్శకుడు హెచ్ వినోద్ తెరకెక్కించిన ఈ సినిమా సెన్సార్ సమస్యలు, అభ్యంతరకర సన్నివేశాల వివాదాల కారణంగా వాయిదా పడింది. ఇదే సమయంలో సినిమా క్లిప్స్‌తో పాటు మొత్తం సినిమా ఆన్‌లైన్‌లో లీక్ కావడం చిత్రబృందానికి పెద్ద షాక్‌గా మారింది. దీంతో సినిమాపై ఉన్న ఆసక్తి తగ్గిపోతుండగా వ్యాపార ఒప్పందాలపై కూడా ప్రభావం పడుతున్నట్లు తెలుస్తోంది.
ముందుగా అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా డిజిటల్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే విడుదల ఆలస్యం కావడం, సినిమాపై ఆసక్తి తగ్గిపోవడంతో ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని ఆ సంస్థ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు జీ5 తక్కువ మొత్తంతో కొత్త ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. ఈ ఒప్పందం జరిగితే నిర్మాతలకు భారీ నష్టం వచ్చే అవకాశముందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో పూజా హెగ్డే, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!