
బిజినెస్

ధనుష్, మమితా బైజు జంటగా నటించిన ‘కర’ సినిమా ఏప్రిల్ 30న తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. దర్శకుడు విఘ్నేష్ రాజా తెరకెక్కించిన ఈ సినిమాను వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ నిర్మిస్తోంది. టీజర్, ట్రైలర్‌తో ఇప్పటికే ఈ సినిమాపై భారీ ఆసక్తి ఏర్పడింది. ఈ సినిమాను భారీ వ్యయంతో నిర్మించినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. అయితే ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా బయటకు రాలేదు. మరోవైపు అడ్వాన్స్ బుకింగ్స్‌కు కూడా మంచి స్పందన వస్తోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. థియేటర్లలో ప్రదర్శన పూర్తయ్యాక ఈ సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రానికి సంగీతాన్ని జీవీ ప్రకాష్ కుమార్ అందించారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!