
బిజినెస్

తరుణ్ భాస్కర్ తెలుగు సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు. పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది, కీడా కోలా సినిమాలతో ఆయన దర్శకుడిగా మంచి పేరు సంపాదించారు. అయితే ఇటీవల ఆయన దర్శకత్వం కంటే నటనపై ఎక్కువ దృష్టి పెట్టడం చర్చనీయాంశంగా మారింది.
తాజాగా వచ్చిన ‘గాయపడిన సింహం’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలు అందుకోలేకపోతోందని సమాచారం. అంతకుముందు వచ్చిన ‘ఓం శాంతి శాంతి శాంతిహి’ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఇలా వరుసగా హీరోగా చేసిన సినిమాలు నిరాశపరచడంతో దర్శకుడిగా ఆయన సంపాదించుకున్న గుర్తింపుపై ప్రభావం పడే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే ఇకపై దర్శకత్వంపైనే ఎక్కువ దృష్టి పెట్టాలని, ముఖ్యంగా ఈ నగరానికి ఏమైంది 2 వంటి ప్రాజెక్టులను జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్లాలని సూచిస్తున్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!