

నిన్న రాత్రి నుంచీ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఇండిగో విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తడంతో ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ తదితర నగరాలకు వెళ్లాల్సిన ఫ్లైట్లు తీవ్రంగా ఆలస్యమయ్యాయి. దీనివల్ల సుమారు వెయ్యి మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌లోనే చిక్కుకుపోయారు. పరిస్థితి పై స్పష్టత లేకపోవడంతో ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది. సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఇండిగో సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
తెల్లవారుజామున రెండు గంటలకు బెంగళూరుకు వెళ్లాల్సిన ఫ్లైట్‌ను రన్‌వేపై రెండు గంటలపాటు నిలిపివేయడం మరో అంశంగా మారింది. అనంతరం ప్రయాణికులను విమానం నుంచి కిందకు దింపి ఎయిర్‌పోర్ట్‌లోనే వేచి ఉండాలని సూచించారు. విదేశాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు తమ కనెక్టింగ్ ఫ్లైట్లు మిస్సవగా, వీసా ఇంటర్వ్యూలకు వెళ్లాల్సిన వారు కూడా ఆలస్యంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులు, ఇండిగో సిబ్బందితో తీవ్ర వాగ్వాదానికి దిగిన సంఘటనలు చోటుచేసుకున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!