
సినిమాలు

విమాన ప్రయాణాల్లో ఇయర్ఫోన్లు ఉపయోగించకుండా బిగ్గరగా పాటలు వింటూ తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఇటువంటి ప్రవర్తనను ‘అన్రూలీ ప్యాసెంజర్’గా పరిగణించి, అవసరమైతే విమానం నుంచి దించేయడం లేదా భవిష్యత్తులో ప్రయాణంపై నిషేధం విధించే అవకాశం ఉందని తెలిపింది.
లోక్సభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయమంత్రి మురళీధర్ మోహోల్ మాట్లాడుతూ, క్రమశిక్షణలేని ప్రయాణికులపై చర్యలు తీసుకోవడానికి ఎయిర్క్రాఫ్ట్ రూల్స్-1937 కింద ఇప్పటికే నిబంధనలు ఉన్నాయని వివరించారు. ముందస్తు అనుమతి లేకుండా విమానాశ్రయాల్లో లేదా విమానంలో ఫొటోలు తీయడం నిబంధనలకు విరుద్ధమని కూడా ఆయన గుర్తు చేశారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!