
గాసిప్స్

అమెరికాతో ట్రేడ్ డీల్‌పై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. నిషేధం ఉన్న దేశాల నుంచి చమురు కొనుగోలు చేయబోమని కేంద్రం ప్రకటించింది. ముఖ్యంగా వెనెజువెలా నుంచి చమురు దిగుమతి చేసుకునే ఆలోచన లేదని స్పష్టం చేసింది. రైతుల ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని కేంద్రం పేర్కొంది. భారత్–అమెరికా ట్రేడ్ ఒప్పందం దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలపరుస్తుందని తెలిపింది.
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ, ఈ ట్రేడ్ డీల్ వల్ల అన్ని వర్గాల ప్రజలకు లాభం చేకూరుతుందని చెప్పారు. ట్రేడ్ ఒప్పందంపై విపక్షాలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని ఆరోపించారు. లోక్‌సభలో విపక్షాల ప్రవర్తన సరిగా లేదని విమర్శించారు. ట్రేడ్ డీల్ అంశంలో రాహుల్ గాంధీ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారని ఆయన ఆరోపించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!