

బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ చుట్టూ రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసు ఉచ్చు మరింత బిగుస్తోంది. ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న సుకేశ్ చంద్రశేఖర్ తో సంబంధం ఉన్న ఈ కేసులో తాను కేవలం బాధితురాలినని పేర్కొంటూ అప్రూవర్‌గా మారేందుకు జాక్వెలిన్ కోర్టును ఆశ్రయించింది. అయితే ఆమె పిటిషన్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తీవ్రంగా వ్యతిరేకించింది.
పాటియాలా హౌస్ కోర్టులో జరిగిన విచారణలో జాక్వెలిన్‌కు సుకేశ్ క్రిమినల్ నేపథ్యం పూర్తిగా తెలిసే ఉన్నప్పటికీ అతనితో సంబంధాలు కొనసాగించిందని ఈడీ వాదించింది. నేరాల ద్వారా సంపాదించిన డబ్బుతో కొనుగోలు చేసిన ఖరీదైన బహుమతులు, వజ్రాలు, విదేశీ ప్రయాణాలు, నగదును ఆమె స్వీకరించడమే కాకుండా కుటుంబ సభ్యులకు కూడా అందేలా చూసిందని ఆరోపించింది. ఐదు సార్లు స్టేట్మెంట్లు రికార్డ్ చేసినప్పటికీ కీలక విషయాలు దాచిపెట్టిందని, దర్యాప్తుకు పూర్తిగా సహకరించలేదని ఈడీ కోర్టుకు తెలిపింది. ఈ వ్యవహారంపై ఈ నెల 12లోగా లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!