

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం కు వస్తున్న భక్తుల రద్దీ వారాంతం మినహా మిగిలిన రోజుల్లో తక్కువగా కనిపిస్తోంది. వేసవి సెలవుల నేపథ్యంలో భారీ సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా వేసిన టీటీడీ అధికారులు వీఐపీ బ్రేక్ దర్శనాల రద్దు, రింగురోడ్డులో అదనపు క్యూ లైన్ల నిర్మాణం వంటి ముందస్తు చర్యలు చేపట్టారు.
అయితే గత కొన్ని రోజులుగా క్యూ లైన్లు ఖాళీగానే కనిపిస్తున్నాయి. సోమవారం ఉదయం సర్వదర్శనం క్యూలైన్లోకి వచ్చిన భక్తులకు నేరుగా దర్శనం లభించింది. సాయంత్రానికి 25 కంపార్ట్మెంట్లలో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు. సిఫార్సు దర్శనాలు రద్దు కావడంతో శ్రీపద్మావతి విచారణ కేంద్రం, ఎంబీసీ గదుల కౌంటర్ల వద్ద కూడా రద్దీ తగ్గింది. ఖాళీగా మిగిలిన గదులను దర్శన టికెట్లు ఉన్న భక్తులకు కేటాయిస్తున్నారు. వారాంతం తప్ప మిగిలిన రోజుల్లో మరింత వెసులుబాటు కల్పించాలని భక్తులు కోరుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!