
సినిమాలు

తెలంగాణలో కనీస వేతనాల సవరణను శాస్త్రీయంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఈ సందర్భంగా దేశంలోని ఇతర ప్రధాన రాష్ట్రాల్లో అమలవుతున్న కనీస వేతనాల విధానాలను కమిటీ సమగ్రంగా పరిశీలించినట్లు వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న కొత్త లేబర్ కోడ్ ప్రభావంపై కూడా సుదీర్ఘంగా చర్చించినట్లు ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తెలంగాణను కార్మికుల పక్షపాతి రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలిపారు. త్వరలోనే అన్ని వర్గాల అభిప్రాయాలను సేకరించి, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులకు మేలు చేసే విధంగా కనీస వేతనాల సవరణపై తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!