
జనరల్

చెరువుల పరిరక్షణ కోసం హైడ్రా పటిష్టమైన సీసీటీవీ నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసింది. చెరువుల్లో మట్టి పోయడం, నిర్మాణ వ్యర్థాలు వేయడం, అక్రమ ఆక్రమణలు చేపట్టే ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసేందుకు దాదాపు 900 కెమెరాలను ఏర్పాటు చేసి వాటిని హైడ్రా కార్యాలయంలోని సర్వర్‌కు అనుసంధానించారు.
ఈ సీసీటీవీ నిఘా వ్యవస్థను సోమవారం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ప్రారంభించారు. చెరువుల వద్ద జరిగే ప్రతి కదలికను కంట్రోల్ రూమ్ నుంచి నిరంతరం పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశారు. అక్రమంగా మట్టి తరలించే వాహనాల వివరాలను వెంటనే గుర్తించి లేక్ ప్రొటెక్షన్ టీమ్‌లను అప్రమత్తం చేసే విధంగా వ్యవస్థను రూపొందించారు. బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో కూడా ఈ కెమెరాలను అనుసంధానం చేయడంతో నిఘా మరింత బలోపేతమవుతుందని అధికారులు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!