

తృణమూల్ కాంగ్రెస్ కు పశ్చిమ బెంగాల్లో మరో భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ ముఖ్య నేత, మాజీ మంత్రి సుజిత్ బోస్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్టు చేశారు. మున్సిపల్ రిక్రూట్మెంట్ కుంభకోణం కేసులో దాదాపు ఏడు గంటల పాటు విచారణ జరిపిన అనంతరం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. మమతా బెనర్జీ ప్రభుత్వ హయాంలో సుజిత్ బోస్ ఫైర్ సర్వీసెస్ మంత్రిగా పనిచేశారు.
ఈ కేసులో సుజిత్ బోస్ కుమారుడు సముద్ర బోస్‌కు కూడా ఈడీ సమన్లు జారీ చేసింది. బెంగాల్లో అధికార మార్పిడి జరిగిన తర్వాత టీఎంసీకి చెందిన కీలక నేత అరెస్టు కావడం ఇదే తొలిసారి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీపై వచ్చిన అవినీతి ఆరోపణలను ప్రధాన ప్రచార అంశంగా మార్చిన బీజేపీ ఘన విజయం సాధించింది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా లు టీఎంసీ అవినీతి అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!