

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాలతో పాటు గతంలో హామీ ఇచ్చిన నిధులను మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ తో వేర్వేరుగా భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన హామీలు, పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించిన నిధులపై చర్చించారు.
పోలవరం ప్రాజెక్టును 2027 గోదావరి పుష్కరాల లోపు పూర్తి చేసేందుకు పూర్తి సహకారం అందించాలని సీఎం చంద్రబాబు జలశక్తి మంత్రిని కోరారు. కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణం పూర్తయిందని, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో పెండింగ్ ప్రజాభిప్రాయ సేకరణ కారణంగా 2011లో జారీ చేసిన స్టాప్ వర్క్ ఉత్తర్వులను శాశ్వతంగా ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాలువల సామర్థ్యాన్ని పెంచిన మేరకు నిధులు రీయింబర్స్ చేయాలని, ప్రాజెక్టు తదుపరి పనులకు అవసరమైన నిధులను విడుదల చేయాలని కేంద్రాన్ని కోరారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!