

మోహన్‌లాల్ అభిమానులు మరియు సినీ ప్రియులకు నిరాశ కలిగించే వార్త వెలువడింది. దృశ్యం 3 సినిమా విడుదల వాయిదా పడినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని మోహన్‌లాల్ ఎక్స్ వేదికగా వెల్లడిస్తూ, “గతం ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండదు, అది వేచి చూస్తుంది. జార్జ్‌కుట్టి మే 21, 2026న వస్తున్నాడు” అని పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని జీతూ జోసెఫ్ తెరకెక్కిస్తున్నారు. వీరి కాంబినేషన్లో వచ్చిన గత దృశ్యం సినిమాలు భారీ విజయాన్ని సాధించాయి.
ఇక హిందీ దృశ్యం 3 షూటింగ్ వేగంగా జరుగుతోంది. అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 2న విడుదల కానుంది. అనుకోకుండా జరిగిన హత్య చుట్టూ తిరిగే కుటుంబ కథతో రూపొందిన ఈ సిరీస్ ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసింది. మలయాళంలో మోహన్‌లాల్, తెలుగులో వెంకటేష్ నటించిన ఈ సినిమా పలు భాషల్లో రీమేక్ అయి విశేష ఆదరణ పొందింది.










.webp&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!