

కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది పద్మ అవార్డులను ప్రకటించింది. ఈ జాబితాలో 113 మందికి పద్మశ్రీ, ఐదుగురికి పద్మవిభూషణ్, 13 మందికి పద్మభూషణ్ అవార్డులు ప్రకటించారు. క్రీడా విభాగంలో భారత క్రికెటర్ రోహిత్ శర్మ, మహిళా జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌లకు పద్మశ్రీ పురస్కారాలు లభించాయి.
తెలంగాణ రాష్ట్రానికి మొత్తం ఏడు పద్మశ్రీ అవార్డులు దక్కగా, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పలువురికి జాతీయ గౌరవం లభించింది. ఏపీకి చెందిన నిర్మాత మురళీ మోహన్, సినీనటుడు రాజేంద్ర ప్రసాద్, గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్, వెంపటి కుటుంబ శాస్త్రిలకు పద్మశ్రీ వరించింది. తెలంగాణకు చెందిన విజయ్ ఆనంద్ రెడ్డి, గడ్డమనుగు చంద్రమౌళి, దీపికా రెడ్డిలకు కూడా పద్మశ్రీ అవార్డులు దక్కాయి. కళా విభాగంలో మాగంటి మురళీమోహన్‌కు పద్మశ్రీ లభించింది.
 (1).png)
ప్రముఖ హిందీ సినీనటుడు ధర్మేంద్రకు పద్మవిభూషణ్, మలయాళ సినీ దిగ్గజం మమ్ముట్టికి పద్మభూషణ్ అవార్డు ప్రకటించారు. పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అవార్డు గ్రహీతలందరికీ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. వివిధ రంగాల్లో వారు చూపిన అంకితభావం, సేవల కారణంగానే ఈ ప్రతిష్టాత్మక గౌరవాలు లభించాయని సీఎం పేర్కొన్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!