
సినిమాలు

ఇరాన్లో ఉన్న భారతీయులను స్వదేశానికి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. భారత్‌కు తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నవారిని దశలవారీగా తీసుకువచ్చే ఏర్పాట్లు చేస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. భారతీయుల భద్రతే ప్రధాన లక్ష్యమని, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని అధికారులు తెలిపారు.
ఈ తరలింపు ప్రక్రియ కోసం ఇరాన్‌లోని భారత దౌత్య కార్యాలయాలతో సమన్వయం కొనసాగుతున్నట్లు విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ప్రయాణానికి సంబంధించిన వివరాలు, నమోదు ప్రక్రియను త్వరలో ప్రకటిస్తామని తెలిపింది. భారతీయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం భరోసా ఇచ్చింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!