

ఉత్కంఠభరితమైన సస్పెన్స్ థ్రిల్లర్ ఎం4ఎం (మోటివ్ ఫర్ మర్డర్) సినిమా వచ్చే నెల 8 న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాను దర్శకుడు మోహన్ వడ్లపట్ల స్వయంగా నిర్మించారు. ఇందులో జో శర్మ, సంబీత్ ఆచార్య ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతోంది. భారత్‌లో విడుదల బాధ్యతలను పీవీఆర్ ఇనాక్స్ పిక్చర్స్ చేపట్టగా, అమెరికా మరియు ఉత్తర భారతంలో ఇతర సంస్థలు విడుదల చేస్తాయి. మర్డర్ మిస్టరీ కథతో ఈ సినిమా ఇప్పటికే మంచి ఆసక్తిని రేకెత్తించింది.
ఈ సినిమా విడుదలకు ముందే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ప్రముఖ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రైవేట్ స్క్రీనింగ్ జరగగా, ముంబైలో ప్రత్యేక ప్రదర్శన కూడా జరిగింది. ఈ షోలకు మంచి స్పందన వచ్చింది. హీరోయిన్ జో శర్మ అమెరికా, భారత్‌లో చేసిన ప్రమోషన్లు సినిమాకు మరింత ప్రచారం తీసుకువచ్చాయి. కథ, సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని దర్శకుడు నమ్మకం వ్యక్తం చేశారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!