
సినిమాలు

కేంద్ర బడ్జెట్ 2026–27లో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు ప్రకటించింది. 17 రకాల క్యాన్సర్ మందుల ధరలను తగ్గిస్తూ, వాటిపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 10 శాతానికి తగ్గించింది. అలాగే క్యాన్సర్ మందుల దిగుమతులపై కస్టమ్స్ సుంకాన్ని గరిష్టంగా 10 శాతానికి పరిమితం చేసింది. దీంతో ప్రాణాపాయ వ్యాధుల చికిత్స మరింత చవకగా అందుబాటులోకి రానుంది.
ఇక సెల్ ఫోన్లు, ఎలక్ట్రిక్ వాహనాల ధరలు కూడా తగ్గనున్నాయి. మొబైల్ ఫోన్లు, ఈవీల బ్యాటరీలపై సుంకాన్ని పూర్తిగా రద్దు చేయడంతో పాటు, విదేశాల నుంచి దిగుమతి చేసే విడిభాగాలపై సుంకాలను మినహాయించారు. విమానాల విడిభాగాలపైనా కస్టమ్స్ సుంకం తొలగించడంతో విమానయాన రంగానికి ఊరట లభించనుంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!