
న్యూస్

ప్రముఖ నటుడు చిరంజీవి మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ఆపదలో ఉన్న తన సిబ్బందికి ఆర్థిక సహాయం అందిస్తూ అండగా నిలిచారు. మేకప్ ఆర్టిస్ట్ శివనాథ్ హార్ట్ సర్జరీ కోసం రూ.10.5 లక్షలు, మాజీ మేనేజర్ నరసయ్య సతీమణి బైపాస్ సర్జరీ కోసం రూ.9.5 లక్షలు అందజేశారు. కేవలం డబ్బుతోనే కాకుండా, శస్త్ర చికిత్సల ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తూ, ఆ కుటుంబాలకు మానసికంగా కూడా తోడుగా నిలిచారు.
ఇటీవల తెలంగాణ ప్రభుత్వం అందజేసిన ఎన్టీఆర్ నేషనల్ అవార్డు నగదు బహుమతి రూ.10 లక్షలను కూడా చిరంజీవి పలు సేవా సంస్థలకు విరాళంగా అందించారు. కొవిడ్, వరదల వంటి విపత్కర సమయాల్లో బాధితులకు సహాయం చేస్తూ ఆయన ఎప్పుడూ ముందుంటారు. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ సేవల ద్వారా ఎన్నో మంది జీవితాల్లో వెలుగులు నింపుతూ, ఒక మంచి మనిషిగా తన ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!