
గాసిప్స్

మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విశ్వ హిందూ పరిషత్ (VHP) నాయకుడిపై జరిగిన దాడి ఉదంతం హింసాత్మక ఘటనలకు దారితీసింది. ఈ ఘటన అనంతరం ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి పలుచోట్ల బస్సులకు నిప్పు పెట్టడంతో పాటు, ఇళ్లపై రాళ్లు రువ్వారు. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు.
హింస మరింత విస్తరించకుండా నియంత్రణ చర్యలు చేపట్టిన ఉజ్జయినీ పోలీసులు నగరంలో నిషేధాజ్ఞలు అమలు చేశారు. భారీగా పోలీసు బలగాలను మోహరించి, పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. శాంతిభద్రతలు కాపాడేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలో ఉందని, ప్రజలు శాంతియుతంగా ఉండాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!