
గాసిప్స్

కేంద్ర బడ్జెట్లో మత్స్యకారుల సంక్షేమానికి ఊరట కలిగించే రెండు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. అంతర్జాతీయ జలాల్లో భారత నౌకలు వేటాడే చేపలపై ఉండే దిగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఎత్తివేసింది. ఈ నిర్ణయం డీప్సీ ఫిషింగ్ చేసే బోటు యజమానులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు.
అలాగే రొయ్యలు, చేపల ప్రాసెసింగ్‌కు అవసరమైన ముడిసరుకులపై దిగుమతి సుంకం మినహాయింపు పరిమితిని 1 శాతం నుంచి 3 శాతానికి పెంచారు. దీని వల్ల ఆక్వా పరిశ్రమలకు ఆర్థికంగా లాభం చేకూరుతుందని, మత్స్యరంగం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!