
జనరల్

ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సోమవారం ముంబైలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల మధ్య పెట్టుబడుల అవకాశాలు, విధానాల మార్పిడి, పరిపాలనా సహకారం వంటి అంశాలపై చర్చలు జరిగినట్లు సమాచారం.
ఈ సందర్భంగా ఏపీలో అమలవుతున్న ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’, విద్యా రంగ సంస్కరణలు, స్కిల్ డెవలప్‌మెంట్ విధానాల గురించి లోకేష్ వివరించారు. అలాగే మహారాష్ట్రలో అమలవుతున్న ఉత్తమ విధానాలను ఆయన తెలుసుకున్నారు. సమావేశంలో పరస్పర గౌరవ సూచకంగా బహుమతుల మార్పిడి జరిగింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!