
టెక్నాలజీ

దేశ రాజధాని దిల్లీలో పది పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈమెయిల్స్ రావడంతో తీవ్ర కలకలం ఏర్పడింది. సోమవారం ఉదయం ఈ మెయిల్స్ అందినట్లు దిల్లీ ఫైర్ సర్వీస్ అధికారులు తెలిపారు. అప్రమత్తమైన అధికారులు వెంటనే ముందస్తు జాగ్రత్తగా పాఠశాలలను ఖాళీ చేయించి, విద్యార్థులు మరియు సిబ్బందిని సురక్షితంగా బయటకు తరలించారు.
సమాచారం అందుకున్న వెంటనే బాంబు డిస్పోజల్ విభాగం, డాగ్ స్క్వాడ్స్తో కలిసి ఆయా పాఠశాలలకు చేరుకుని విస్తృతంగా తనిఖీలు చేపట్టింది. ప్రజల భద్రతకు ఎలాంటి ముప్పు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. బెదిరింపు మెయిల్స్ వెనుక ఉన్న వారిని గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!