
న్యూస్

శంషాబాద్ విమానాశ్రయంలో రెండు అంతర్జాతీయ ఫ్లైట్లకు ఒకేసారి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో భద్రతా సిబ్బంది అలెర్ట్ అయ్యారు. అబుదాబి నుంచి వస్తున్న ఇండిగో ఫ్లైట్‌కు, అలాగే లండన్ నుంచి వచ్చిన బ్రిటిష్ ఎయిర్‌లైన్స్ విమానానికి ఈ ఇమెయిల్ చేరడంతో వెంటనే చర్యలు ప్రారంభించారు. జాగ్రత్త చర్యల భాగంగా ఇండిగో విమానాన్ని ముంబైకి మళ్లించారు. బ్రిటిష్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్‌ను అయితే శంషాబాద్ ఎయిర్‌పోర్టులోనే అత్యవసర ల్యాండింగ్ చేయించి, ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.
తర్వాత CISF టీమ్ బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ల సహాయంతో విమానం, లగేజ్, పరిసరాలను పూర్తిగా తనిఖీ చేసింది. బెదిరింపు నిజమా కాదా అనేది తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.




















కామెంట్స్ (1)
ఆందోళనకరం!