
గాసిప్స్

బంగ్లాదేశ్ పార్లమెంటు ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ (బీఎన్పీ) విజయం సాధించింది. మొత్తం 299 పార్లమెంటు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో మిత్రపక్షాలతో కలిపి 212 స్థానాల్లో విజయం సాధించినట్లు పార్టీ ప్రకటించింది. ఈ ఫలితాలతో బీఎన్పీ నేత తారిఖ్ రహ్మాన్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు స్పష్టమయ్యాయి.
జమాత్-ఏ-ఇస్లామీ పార్టీ 70 స్థానాల్లో విజయం సాధించగా, మిగిలిన స్థానాలను ఇతర పార్టీలు మరియు స్వతంత్ర అభ్యర్థులు గెలుచుకున్నారు. తారిఖ్ రహ్మాన్ ఢాకా-17, బోగ్రా-6 నియోజకవర్గాల నుంచి పోటీ చేసి రెండుచోట్లా విజయం సాధించారు. అయితే అధికారిక ఫలితాల ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.
ఎన్నికలకు కొద్దిరోజుల ముందే తన తల్లి ఖాలిదా మరణించడంతో విజయోత్సవాలను వాయిదా వేసి సాధారణ ప్రార్థనలు మాత్రమే నిర్వహించాలని తారిఖ్ రహ్మాన్ పార్టీ కార్యకర్తలను కోరారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!