

కృత్రిమ మేధ (ఏఐ)ను ప్రజారోగ్య రంగంలో విస్తృతంగా వినియోగించడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఉన్నత స్థాయి వైద్య నైపుణ్యం దేశవ్యాప్తంగా అందరికీ చేరువయ్యేలా ఏఐ ఆధారిత సాధనాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని శుక్రవారం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో పేర్కొంది. జాతీయ టీబీ నిర్మూలన కార్యక్రమం, జాతీయ డయాబెటిక్ రెటినోపతి స్క్రీనింగ్, సమగ్ర వ్యాధి పర్యవేక్షణ పథకాల్లో ఏఐని వినియోగిస్తున్నట్లు వివరించింది. ఈ చర్యల వల్ల టీబీ నియంత్రణలో 27 శాతం మెరుగైన ఫలితాలు సాధించామని, మహమ్మారి ముప్పుపై 4,500 అప్రమత్తత సందేశాలు పంపినట్లు వెల్లడించింది.
అలాగే ఈ-సంజీవని టెలీమెడిసిన్ పథకం కింద 28.2 కోట్ల వ్యాధి నిర్ధారణ పరీక్షలకు ఏఐ సహకరించిందని కేంద్రం తెలిపింది. పోషకాహార లోపం పర్యవేక్షణలో ఉద్యోగ్ యంత్ర ఏఐ వ్యవస్థ కీలకంగా ఉపయోగపడిందని పేర్కొంది. సాంక్రమిక వ్యాధుల నిర్వహణ నుంచి కేన్సర్ చికిత్స వరకు, ఆయుర్వేద వైద్య ఆధునీకరణ నుంచి జాతీయ ఏక ఆరోగ్య పథకం అమలువరకు ఏఐ అనేక విధాలుగా ఆరోగ్య రంగానికి తోడ్పడుతోందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!