

కర్ణాటకలో బైక్ ట్యాక్సీలపై అమలులో ఉన్న నిషేధాన్ని రాష్ట్ర హైకోర్టు ఎత్తివేసింది. గతంలో జారీ చేసిన ఆదేశాలను నిలిపివేస్తూ, బైక్ ట్యాక్సీ సేవల పునరుద్ధరణకు మార్గం సుగమం చేసింది. అయితే, ఈ సేవల నిర్వహణకు సంబంధించి పలు నిబంధనలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం బైక్ ట్యాక్సీలను వాణిజ్య వాహనాలుగా పరిగణించనుండగా, వాటిపై పసుపు రంగు నంబర్ ప్లేట్లు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది.
గత ఏడాది జూన్లో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా బైక్ ట్యాక్సీ సేవలు నిలిచిపోయాయి. తాజా తీర్పుతో మళ్లీ సేవలు ప్రారంభమయ్యే అవకాశం ఏర్పడింది. ఈ నిర్ణయం ప్రయాణికులు, డ్రైవర్లు మరియు యాప్ ఆధారిత రైడ్ సేవల సంస్థలకు ఊరటనిచ్చే అంశంగా మారింది. ప్రభుత్వం త్వరలోనే అవసరమైన నిబంధనలు ఖరారు చేసి అమలు చేయనుందని సమాచారం.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!