
%20(1).png&w=3840&q=75)
తెలుగు సినీ పరిశ్రమలో మెగా, నందమూరి కుటుంబాల మధ్య ఉన్న అనుబంధం మరోసారి చర్చనీయాంశంగా మారింది. వెండితెరపై పోటీ ఉన్నా, వ్యక్తిగతంగా మాత్రం ఇరు కుటుంబాల మధ్య ఆప్యాయత తగ్గదని మరోసారి రుజువైంది. ఇటీవల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవలలు జన్మించడంతో మెగా కుటుంబంలో సంబరాలు అంబరాన్ని అంటాయి. క్లిన్ కారా తర్వాత అబ్బాయి రాకతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఈ సంతోషకరమైన వేళ మెగాస్టార్ చిరంజీవి తన మనవడిని చూసే కల నెరవేరడంతో ఉప్పొంగిపోయారని సమాచారం. ఇదే సందర్భంలో నందమూరి బాలకృష్ణ తన పెద్దరికాన్ని చాటుతూ చరణ్ దంపతులకు ప్రత్యేక కానుకలు పంపినట్లు తెలుస్తోంది. తిరుమల శ్రీవారిపై అపార భక్తి కలిగిన బాలయ్య, స్వామివారి దివ్య పటంతో పాటు ప్రసాదం, పూలగుచ్చాలు పంపడమే కాకుండా కవల పిల్లల కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన బంగారు ఆభరణాలు, వెండి బొమ్మలను కానుకగా ఇచ్చారని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. వెండితెరపై పోటీ ఉన్నా, బయట మాత్రం స్నేహమే మిన్న అన్న విషయాన్ని ఈ సంఘటన మరోసారి నిరూపించింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!