

దేశంలోని అస్సాం, కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ఈ మేరకు వారంలోగా ప్రకటన వచ్చే అవకాశముందని ఈసీ వర్గాలు తెలిపాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ నేతృత్వంలోని బృందం ప్రస్తుతం పశ్చిమబెంగాల్లో ఎన్నికల ఏర్పాట్లను సమీక్షిస్తోంది. ఈ పర్యటన అనంతరం బృందం దిల్లీకి తిరిగి చేరుకున్నాక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.
ఇప్పటికే అస్సాం, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఎన్నికల ఏర్పాట్లను ఈసీ పరిశీలించింది. మరోవైపు ఎన్నికలను గరిష్టంగా రెండు దశల్లో నిర్వహించాలని పలు రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘాన్ని కోరాయి. కోల్కతాలో జరిగిన సమావేశంలో టీఎంసీ, భాజపా, సీపీఎం, కాంగ్రెస్, ఆప్ నాయకులు పాల్గొని ఎన్నికల భద్రతా ఏర్పాట్లపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఎన్నికల సమయంలో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఈసీని కోరారు.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!