
గాసిప్స్

iBomma రవి కేసులో కస్టడీ మరియు బెయిల్ పిటిషన్లపై నాంపల్లి కోర్టులో గురువారం వాదనలు ముగిశాయి. రవి నుంచి ఇంకా కీలక సమాచారం సేకరించాల్సి ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు. పైరసీకి సంబంధించిన నాలుగు వేరువేరు కేసుల్లో విచారణ కొనసాగుతున్నందున ఈ దశలో బెయిల్ ఇవ్వకూడదని పీపీ వాదించారు. రవి బెయిల్ పిటిషన్పై కూడా ఇరుపక్షాల వాదనలు కొనసాగాయి.
వాదనలు పూర్తయ్యాక నాంపల్లి కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. బెయిల్ మరియు కస్టడీ పిటిషన్ల పై తుది తీర్పు శుక్రవారం వెలువడనుంది. ఈ కేసుపై ప్రజలు మరియు సినిమా పరిశ్రమలో ఆసక్తి పెరగడంతో, కోర్టు నిర్ణయం ఏంటి అన్నదానిపై అందరి దృష్టి నిలిచింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!