

ఏపీపీఎస్సీ గ్రూప్-1 పోస్టుల ఎంపిక జాబితాను ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. హైకోర్టులో ఉన్న కేసులకు సంబంధించిన అడ్డంకులు తొలగడంతో శుక్రవారం సాయంత్రం తుది ఎంపిక జాబితాను ప్రకటించింది. మొత్తం 89 పోస్టులకు గాను 87 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయగా, క్రీడా కోటాకు సంబంధించిన రెండు పోస్టులను కోర్టు ఆదేశాల మేరకు తాత్కాలికంగా నిలిపివేసింది. ఆ రెండు పోస్టులు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ మరియు డీఎస్పీగా ఉన్నాయి.
గ్రూప్-1 భర్తీ ప్రక్రియ 2023 డిసెంబరు 8న నోటిఫికేషన్ విడుదలతో ప్రారంభమైంది. 2024 మార్చి 17న ప్రిలిమ్స్, 2025 మేలో మెయిన్స్ పరీక్షలు నిర్వహించి జూన్లో ఫలితాలు ప్రకటించారు. అనంతరం 2024 జూన్ 23 నుంచి జులై 15 వరకు సాధారణ అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించగా, క్రీడా కోటా అభ్యర్థుల ఇంటర్వ్యూలు ఈ ఏడాది జనవరి 7న పూర్తయ్యాయి. ఎంపికైన పోస్టుల్లో డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్, ఆర్టీవో, మండలాభివృద్ధి అధికారి తదితర కీలక హోదాలు ఉన్నాయి.
పోస్టుల వివరాలు (ప్రధానంగా):
డిప్యూటీ కలెక్టర్ – 9, డీఎస్పీ – 25, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ – 17, ఆర్టీవో – 6, మండలాభివృద్ధి అధికారి – 4 తదితర పోస్టులు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!