

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీల్లో భాగంగా మెగా డీఎస్సీ, టెట్ పరీక్షలను విజయవంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఇటీవల ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) రాసిన అభ్యర్థులకు పాఠశాల విద్యాశాఖ తాజాగా శుభవార్త ప్రకటించింది.
అక్టోబర్ సెషన్‌కు సంబంధించిన టెట్–2025 ప్రిలిమినరీ కీని అధికారిక వెబ్సైట్లో విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. డిసెంబర్ 10 నుంచి ప్రారంభమైన ఆన్లైన్ టెట్ పరీక్షలు డిసెంబర్ 21తో ముగియనున్న నేపథ్యంలో, ఇప్పటికే పూర్తయిన సబ్జెక్టులకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీలను అందుబాటులో ఉంచారు.
అభ్యర్థులు తమ రెస్పాన్స్ షీట్లు మరియు ప్రిలిమినరీ ఆన్సర్ కీలను https://tet2dsc.apcfss.in/ వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని ద్వారా వారు తమ మార్కులను ముందుగానే అంచనా వేసుకునే అవకాశం లభించింది.
అలాగే, ప్రాథమిక కీలో ఏవైనా తప్పులు లేదా సందేహాలు ఉన్నట్లయితే, అభ్యర్థులు ఆన్లైన్లో అభ్యంతరాలు తెలపడానికి అవకాశం కల్పించారు. డిసెంబర్ 24వ తేదీ లోపు తగిన ఆధారాలతో అభ్యంతరాలను వెబ్సైట్లో సమర్పించాలి. అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను నిపుణుల కమిటీ పరిశీలించిన తర్వాత తుది ఆన్సర్ కీని విడుదల చేయనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!