

ప్రజలకు మెరుగైన సేవలు అందించడం.. ప్రభుత్వ సేవలను సులభతరం చేయడమే లక్ష్యంగా ఉద్యోగులు, అధికారులంతా పని చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివిధ శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు. సోమవారం ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ఉద్యోగుల పనితీరును మదింపు చేస్తున్న క్రమంలో పనితీరు సరిగా లేని వారిని మోటివేట్ చేయడంతోపాటు... బాగా పని చేస్తున్న వారిని గుర్తించి.. వారిని ప్రొత్సహించాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు సూచించారు. క్షేత్ర స్థాయిలో చక్కగా పని చేస్తూ... ప్రజల మెప్పు పొందిన ఉద్యోగులను గుర్తించి ప్రొత్సహిస్తే బాగుంటుందంటూ సీఎం చేసిన సీఎం సూచనపై పలువురు అధికారులు బాగుంటుందని అభిప్రాయపడ్డారు.
బాగా పని చేసే ఉద్యోగులకు ఈ తరహా అభినందించడం ఇదే తొలిసారి అవుతుందని చెప్పారు. ఈ రకమైన విధానం వల్ల ఉద్యోగుల్లో పోటీతత్వం పెరుగుతుందని ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు. బాగా పని చేస్తున్న ఉద్యోగులను గుర్తించడంతో పాటు వారికి అభినందన లేఖలు పంపాలని సీఎం ఆదేశించారు. ఓ వైపు పని తీరు మదింపు చేస్తూనే.. మరోవైపు ప్రతి నెల బాగా పని చేస్తున్న ఉద్యోగులకు అభినందన లేఖ పంపాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయా శాఖల ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం చెప్పారు.
బాగా పని చేస్తున్న ఉద్యోగులకు అప్రిసియేషన్ లెటర్లు ఇవ్వడమే కాకుండా... వారి వ్యక్తిగత రికార్డుల్లో కూడా వీటిని నమోదు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. బాగా పని చేస్తున్న వారిని ప్రొత్సహిస్తూనే... పనితీరు సరిగా లేని వారిని మోటివేట్ చేసేలా చర్యలు తీసుకునే అంశంపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఇక పనితీరు ఆధారంగా ఉద్యోగులకు వెయిటేజ్ ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.












.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!