
గాసిప్స్

వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యూరప్‌కు బయలుదేరి వెళ్లారు. స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌కు చేరుకున్న ఆయనకు యూరప్‌లోని 20 కిపైగా దేశాల నుంచి వచ్చిన ఎన్నారైలు, టీడీపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్విట్జర్లాండ్‌లోని భారత రాయబారి మృదుల్ కుమార్ కూడా సీఎం చంద్రబాబుకు ఆత్మీయ స్వాగతం తెలిపారు.
అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ అజయ్ బంగా తో సమావేశమయ్యారు. ఆయనతో భేటీ కావడం ఎంతో ఆనందంగా ఉందని సీఎం పేర్కొన్నారు. ఈ సమావేశానికి సంబంధించిన ఫొటోలను సీఎం చంద్రబాబు నాయుడు తన ఎక్స్ (X) ఖాతాలో పంచుకున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!