
గాసిప్స్

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలను బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు పార్టీ అగ్రనేతలను రంగంలోకి దించేందుకు సిద్ధమవుతోంది. ఎన్నికల ప్రచారానికి కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ పాల్గొనే అవకాశం ఉందని సమాచారం.
ప్రచారంలో భాగంగా ఫిబ్రవరి 2, 3 తేదీల్లో మహబూబ్నగర్లో నితిన్ నబిన్ సభ నిర్వహించే ఆలోచనలో పార్టీ ఉంది. అలాగే ఫిబ్రవరి 8, 9 తేదీల్లో నిర్మల్లో కేంద్ర మంత్రి అమిత్ షా సభకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
మున్సిపల్ ఎన్నికల్లో ప్రభావం చూపేందుకు దక్షిణ తెలంగాణలో ఒక సభ, ఉత్తర తెలంగాణలో మరో సభ నిర్వహించాలని బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ సభలతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెంచాలని నాయకత్వం భావిస్తోంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!