
సినిమాలు

అక్కినేని కుటుంబ కోడలు, హీరోయిన్ శోభిత ధూళిపాల చేసిన తాజా సాహసం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. షూటింగ్‌ల నుంచి విరామం దొరకడంతో వెకేషన్‌కు వెళ్లిన ఆమె, ఈసారి సాధారణ ట్రిప్ కాకుండా అడ్వెంచర్‌ను ఎంచుకుంది. జలాంతర్గామిలో సముద్ర లోతుల్లోకి వెళ్లి అక్కడి అద్భుత దృశ్యాలను తన కెమెరాలో బంధించింది. సముద్రపు అందాలు, ప్రశాంత వాతావరణం మధ్య ఆమె తీసిన ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతుండగా, సముద్రంలోకి ఆమె సాహసోపేతంగా దూకిన దృశ్యాలు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. చాలాకాలం తర్వాత ఇలాంటి అడ్వెంచర్ ట్రిప్‌ను అభిమానులతో పంచుకున్న శోభితపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆమె ధైర్యం చూసి ఆశ్చర్యపోతూ, మరిన్ని ఇలాంటి అనుభవాలను పంచుకోవాలని అభిమానులు కోరుతున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!