
సినిమాలు

దేశ రాజధాని ఢిల్లీలో నేడు ఏఐ ఇంపాక్ట్ సదస్సు ప్రారంభం కానుంది. ఈ సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ అధికారికంగా ప్రారంభించనున్నారు. సదస్సులో పాల్గొనేందుకు 45 దేశాలకు చెందిన మంత్రుల బృందాలు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నాయి. కృత్రిమ మేధస్సు ప్రభావం, భవిష్యత్ దిశలపై ఈ సదస్సులో కీలక చర్చలు జరగనున్నాయి.
ఈ సదస్సులో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ తో పాటు పలు అంతర్జాతీయ సంస్థల అధినేతలు ముఖ్య ప్రసంగాలు చేయనున్నారు. ఐదు రోజుల పాటు 700 కుపైగా సెషన్లు నిర్వహించనుండగా, సుమారు 20 దేశాల అధినేతలు సదస్సుకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!