
క్రీడలు

చైనా ఆరేళ్ల క్రితం నిర్వహించిన రహస్య అణు పరీక్షల వివరాలను అమెరికా తాజాగా బయటపెట్టింది. అమెరికా విదేశాంగ శాఖ అండర్ సెక్రటరీ క్రిస్టోఫర్ తెలిపిన ప్రకారం, 2020 జూన్ 22 న చైనాలోని లాప్ నూర్ భూగర్భ కేంద్రంలో భారీ పేలుడు జరిగింది. ఆ సమయంలో 2.75 తీవ్రతతో భూకంపం నమోదైనట్లు తెలిపారు. ఈ ప్రకంపనలను కజకిస్తాన్లోని ఇంటర్నేషనల్ మానిటరింగ్ సెంటర్ గుర్తించినట్లు ఆయన వెల్లడించారు.
అమెరికా ప్రకటన ప్రకారం, ఈ ఘటనకు కేవలం వారం ముందు, అంటే గల్వాన్ లోయలో భారత్ – చైనా దళాల మధ్య జరిగిన ఘర్షణ తరువాత ఈ పేలుడు సంభవించడం గమనార్హమని తెలిపారు. ఈ సమాచారం ప్రపంచ దృష్టిని మళ్లీ చైనా అణు కార్యక్రమాలపై సారిస్తోంది.












.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!