

సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పాటు చేసిన సీబీఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT), తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యి కల్తీదేనని తుది నిర్ధారణకు వచ్చింది. గత జగన్ ప్రభుత్వ హయాంలో సరఫరా అయిన నెయ్యి అసలైన ఆవు నెయ్యి కాదని, పామాయిల్‌కు రసాయనాలు కలిపి నకిలీ నెయ్యి తయారు చేసినట్లు విచారణలో తేలింది. భోలే బాబా డెయిరీకి ఆవులే లేవని, పాల సేకరణ కూడా జరగలేదని SIT స్పష్టం చేసింది. నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం లేని సంస్థలకు టెండర్లు దక్కాయని, ఆ నకిలీ నెయ్యి ఏఆర్ డెయిరీ, వైష్ణవీ డెయిరీ ద్వారా టీటీడీకి సరఫరా అయినట్లు తెలిపింది.
ఈ వ్యవహారంలో టీటీడీ అధికారులు, గత ప్రభుత్వానికి చెందిన కీలక వ్యక్తులు, నెయ్యి సరఫరాదారులు కలిసి కోట్లాది మంది శ్రీవేంకటేశ్వర స్వామి భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీశారని SIT పేర్కొంది. ఈ కుట్రకు సంబంధించిన అన్ని ఆధారాలతో నెల్లూరు ఏసీబీ కోర్టులో తుది చార్జిషీటును దాఖలు చేసింది. టెండర్ నిబంధనల్లో మార్పులు, పామాయిల్ దిగుమతులు, రసాయనాల వినియోగం, నకిలీ నెయ్యి తయారీ విధానం, అలాగే ఇందులో పాల్గొన్న వ్యక్తుల పాత్రలను చార్జిషీటులో సవివరంగా వివరించినట్లు అధికారులు వెల్లడించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!