
న్యూస్

ఇటీవల ‘దండోరా’ సినిమా ఈవెంట్ సందర్భంగా మహిళల దుస్తులపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో సినీ నటుడు శివాజీ మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. ఈ వ్యాఖ్యలపై మహిళా సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో మహిళా కమిషన్ స్వయంగా స్పందించి ఆయనకు నోటీసులు జారీ చేసింది.
నోటీసుల మేరకు శివాజీ శుక్రవారం హైదరాబాద్లోని బుద్ధ భవన్లో ఉన్న మహిళా కమిషన్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కమిషన్ సభ్యులు ఆయన వ్యాఖ్యలపై వివరణ కోరినట్లు సమాచారం. ఘటనపై పూర్తి వివరాలను తెలుసుకుని తగిన చర్యలు తీసుకుంటామని మహిళా కమిషన్ అధికారులు తెలిపారు.
ఈ అంశం ప్రస్తుతం సినీ వర్గాల్లోనే కాకుండా సామాజికంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ప్రజా వేదికలపై మాట్లాడేటప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!